అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపినందుకు బీజేపీ నేత అరెస్ట్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మానేరువాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీలను బీజేపీ నేత గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇసుక లారీలను ఆపడానికి నీకేంటి హక్కు అంటూ ఎస్సై.. సురేష్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు చేయెద్దంటూ ఆదేశించినా.. ఇసుక ఎందుకు తరలిస్తున్నారని సురేష్ రెడ్డి ప్రశ్నించారు. NGT నుంచి తమకు ఎలాంటి ఆదేశం రాలేదని, ట్రాఫిక్ జాం అవుతోందంటూ సురేష్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీలు రోజు తిరగడంతో ఇండ్లలో ఉండలేకపోతున్నామంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.