
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. నేషనల్ ఎడ్యుకేషనల్పాలసీ (ఎన్ఈపీ)పై చర్చ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్డిప్యూటీ చైర్మన్హరివంశ్ను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఆ వ్యాఖ్యలకు ఖర్గే కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన ఖర్గే.. తన కామెంట్స్‌పై సభకు క్లారిటీ ఇచ్చారు.
డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు క్షమాపణలు చెప్పారు. కాగా, ప్రశ్నోత్తరాల సందర్భంగా తమను అనాగరికులు అంటూ అవమానించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీలు డిమాండ్‌చేశారు. అదే సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. తాను మాట్లాడేటప్పుడు సభలో ధర్మేంద్ర ప్రధాన్లేరన్నారు. కేంద్రం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘బయటకు గెంటేస్తాం’ అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు.