బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్ గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటీషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రీజర్వ్ చేసింది. రేపు మద్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. తమ సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 
నిన్నతొలి విడుత వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వివరణ కోరింది.  బీజేపీ ఎమ్మెల్యేల తరఫున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అసెంబ్లీలో నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన శాసనసభ అధిపతి నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారని తెలిపారు.

చట్ట సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చు కానీ.. ఇక్కడ అలా జరగలేదని ప్రస్తావించారు. ఆరోపణలను నిర్ధారించుకునేందుకు  ప్రొసీడింగ్స్ కాపీని కోరగా.. ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలుపగా కోర్టు అంగీకరించలేదు. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీని ఆదేశించిన హైకోర్టు ఇవాళ తదుపరి విచారణను పూర్తి చేసింది. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్