
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తుండగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుంది. కోర్టులో వాదనలు వాడీవేడీగా కోనసాగుతున్నాయి. సీఐడీ, చంద్రబాబు లీగల్ సెల్ న్యాయవాదులు ధీటుగా తమ వాదనలు వినిపిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని ఆయన తరుపు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ స్కామ్ రాజకీయ ప్రేరేపిత అన్న ఆయన.. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలని తిరిగి ఈ కేసు ఓపెన్ చేశారని కోర్టులో వాదించారు.
వాదనలు పూర్తయ్యక ఒకవేళ చంద్రబాబును కోర్టు రిమాండ్ కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వెళ్లే రహదారి పొడవునా వాహనాలు లేకుండా చూస్తున్నారు పోలీసులు.