మేష రాశి వారికి ఈ ఏడాది దబిడి దిబిడే.. ఆదాయం 2, ఖర్చేమో..?

మేష రాశి వారికి ఈ ఏడాది దబిడి దిబిడే.. ఆదాయం 2, ఖర్చేమో..?
  • అశ్వని 1,2,3,4 పాదములు; భరణి 1,2,3,4 పాదములు, కృత్తిక 1 పాదము. మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లూ, ఏ, ల, లో, ఆ
  • ఆదాయం: 2
  • రాజపూజ్యం: 5
  • వ్యయం: 14
  • అవమానం: 7

గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు తామ్రమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు తృతీయంలో లోహమూర్తిగాను తదుపరి ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము. శని: 30.03.2025 నుండి మరల ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము. రాహువు కేతువులు: 30.03.2025 నుండి 18.05.2025 వరకు రజిత మూర్తులుగాను తదుపరి ఉగాది వరకు రజితమూర్తులుగా సంచారము.

ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యముగా ఉంటుంది. రైతు సోదరులు ముహూర్త బలంతో అరకు దున్నుట, విత్తనాలు వేయువారికి అనుకూలము. వృత్తి వ్యాపారులకు సామాన్యము. అప్పులు చేసి స్థిరాస్తులు కొనగలరు. వివాహ ప్రయత్నం ఫలించగలవు. జాతకము చూసి వివాహము చేయండి. ఉద్యోగ ప్రయత్నములు మంచి ముహూర్తబలంతో అప్లికేషన్​ పెట్టగలరు. డాక్టర్లు, లాయర్లకు సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్లర్లకు చాలా సామాన్యంగా ఉంటుంది. బంగారం, వెండి, ఐరన్​ రేట్​ పెరుగుట, తరుగుట నిలకడ లేకుండా ఉంటుంది. కొన్ని దురలవాట్లకు లోను అగుటకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. 

►ALSO READ | మకర సంక్రాంతి ఫలితాలు.. పండగ రోజు ఇలా చేస్తే మంచి జరుగుతుంది

ప్రతి విషయంలో ఉద్రేకము రాకుండా ఉండగలరు. బల్క్​ డ్రగ్స్​, స్మాల్​ ఇండస్ట్రీ వారికి ఆదాయ వనరులు తక్కువగా ఉండగలవు. చిట్స్​, షేర్స్​ పరిస్థితులు అర్థం కావు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. ఏ విధమైన హామీలు ఇచ్చి అమలు చేయలేరు. చాలా జాగ్రత్తగా మాట్లాడగలరు. కంప్యూటర్​ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత లేదు. జాయింట్​ వ్యాపారస్తులకు అనేక విధములుగా సమస్యలు ఉండగలవు. స్నేహితులకు ధనం ఇస్తే తిరిగిరాదు. ఎవరికి ఏ విధమైన హామీలు ఉండరాదు. ఒకవేళ హామీ ఉంటే ఆ డబ్బు మీరు కట్టవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కలుగుటకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. 

సంతానం విషయంలో చాలా సమస్యలు ఉన్నవి. వీరిని ప్రేమతో మీ ఆధీనంలో పెట్టుకొనగలరు. పిల్లలు ఆధిపత్యం పెరిగి పెద్దవారు అల్లరిపాలు అవుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ప్రతి విషయంలో చాలా ఆందోళన కలుగును. విద్యార్థులకు చాలా కష్టకాలంగా ఉంటుంది. సరస్వతీదేవి ద్వాదశ నామాలు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. సినిమా వారికి సామాన్యం. టీవీ ఆర్టిస్టులకు సామాన్యం. 

క్రీడారంగంలో ఉన్నవారికి కీర్తి ఉంటుంది. ప్రైవేట్​ ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. గవర్నమెంట్​ ఉద్యోగులపై ఏసీబీ దాడులు జరుగును. లంచగొండి వారికి కష్టకాలం. పురోహితులకు అధిక ఆదాయం. జ్యోతిష్య శాస్త్రకారులకు అనుకూలం. వాస్తు శాస్త్ర నిపుణులకు సామాన్యం. సిద్ధాంతులకు అనుకూలం. అల్లోపతి వైద్యంలో ఉన్నవారికి అధిక ఆదాయం. ఆయుర్వేద వైద్యంలో ఉన్నవారికి సంతృప్తిగా ఉంటుంది. అశ్వని నక్షత్రము వారు జాతి వైఢూర్యం ధరించండి. వినాయక, సరస్వతి దేవి పూజలు, చిత్రగుప్తుని పూజలు చేయండి. భరణి నక్షత్రం వారు జాతి వజ్రం ధరించండి. 

►ALSO READ | రాజకీయ నాయకుల పంచాంగం.. రాజాధి నవనాయకుల ఫలితాలు..!

గజలక్ష్మిదేవికి పూజలు, కనకధారా స్తోత్రం పారాయణ, శ్రీచక్రానికి కుంకుమ పూజ చేయండి. కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు ధరించి ఆదిత్య హృదయ పారాయణ చేయండి. ఆదివార నియమాలు పాటించాలి. సూర్య నమస్కారములు, యోగ, ధ్యానము చేయండి. అక్యుపంచర్​, ఆయుర్వేదంతో తగ్గని వ్యాధులు లేవు. నవగ్రహ జప దానములు ప్రదక్షిణములు, మహమృత్యుంజయ జపములు చేయగలరు. ఉద్రేకంగా ఉండరాదు. జాగ్రత్తలు పాటించి ఆనందంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. అదృష్ట సంఖ్య 9.