ట్రంప్​కు డెత్ వార్నింగ్..నిందితుడి అరెస్ట్

ట్రంప్​కు డెత్ వార్నింగ్..నిందితుడి అరెస్ట్

న్యూయార్క్: మాజీ అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్‌‌ను చంపేస్తానని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన రోనాల్డ్ సివ్రూడ్‌‌ (66) అనే వ్యక్తిని అరిజోనా పోలీసులు అరెస్టు చేశారు. కోచిస్ కౌంటీలోని అమెరికా- మెక్సికో సరిహద్దులో ట్రంప్ గురు వారం పర్యటించారు. దీనికి ముందు ట్రంప్​ను చంపేస్తానని సోషల్ ​మీడియాలో రోనాల్డ్​ పోస్టు పెట్టాడు. దీంతో విచారణ చేపట్టిన ఆరిజోనా పోలీసులు రోనాల్డ్ సివ్రూడ్​ను అరెస్టు చేశారు. అతడు పలు కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు.