యాదగిరిగుట్ట లో ఆర్జిత సేవలు పునరుద్ధరణ

యాదగిరిగుట్ట లో ఆర్జిత సేవలు పునరుద్ధరణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలు బుధవారం నుండి తిరిగి ప్రారంభం అయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 1 నుంచి 11 వరకుసేవలను రద్దు చేశారు. మంగళవారంతో బ్రహ్మోత్సవాలు ముగియడంతో నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి కైంకర్యాలను పునరుద్ధరించారు.

11 రోజుల తర్వాత ఆర్జిత సేవలు జరుగుతుండడంతో బుధవారం భక్తులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన నిత్య కైంకర్యాలు రాత్రి పవళింపుసేవ, శయనోత్సవంతో ముగిశాయి