
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి దేవస్థానం నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు నిర్వహిస్తారు.
అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు. వారికి దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు అందించడం జరుగుతుంది.
అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.
కరోనా పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఏపీలో సినిమా టికెట్ ధరలపై జీవో జారీ
మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్