చిన్న సినిమా అనగానే డబ్బులు తీసుకుని వెళతారు..వారికి మాత్రం తడిసి మోపెడవుతుంది: అర్జున్ అంబాటి

చిన్న సినిమా అనగానే డబ్బులు తీసుకుని వెళతారు..వారికి మాత్రం తడిసి మోపెడవుతుంది: అర్జున్ అంబాటి

అర్జున్ అంబాటి,‘కొరమీను’ ఫేమ్ కిశోరి దాత్రక్ జంటగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. చైతన్య రావు,  రవి శంకర్ కీలక పాత్ర పోషించారు.  సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్  నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో అర్జున్ అంబాటి చిన్న సినిమాల‌ పరిస్థితిపై ఆస‌క్తికర కామెంట్స్ చేశాడు." బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ తెప్ప స‌ముద్రం మూవీకి చ‌క్క‌టి సపోర్ట్ అందించారు.ప్రతిఒక్కరిలో చిన్న సినిమా అనగానే..కాస్ట్ అండ్ క్రూ వచ్చామా..చెప్పిన పని చేశామా..డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లుగా తమ మైండ్ సెట్ తో ఉంటారు. కానీ సినిమా కోసం డైరెక్టర్, నిర్మాతల‌కు తడిసి మోపెడవుతుంది.

సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు. మా నాన్న,పెద్దనాన్న‌ డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో పర్సనల్ గా నాకు తెలుసు.ఎందుకంటే,ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు తెలిసింది సినిమా ఒక్కటే.కనుకే,అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నాం అన్నారు."

అర్జున్ అంబాటి విషయానికి వస్తే..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అర్జున్ అంబాటి ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఫైన‌ల్ చేరుకున్న అత‌డు చివ‌ర‌లో ఓటింగ్ లో మాత్రం వెనుక‌బ‌డ్డాడు. అర్జున్ బిగ్‌బాస్ కంటే ముందు తెలుగులో ప‌లు సీరియ‌ల్స్‌, సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర పరంపర వెబ్ సీరీస్ లో విలన్ పాత్రలో నటించాడు.