
కోల్‌కతా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్.. టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నీలో మూడో ప్లేస్‌కు చేరాడు. శనివారం జరిగిన మూడు రౌండ్లలో విదిత్, కార్ల్‌సన్‌పై నెగ్గిన అర్జున్.. ప్రజ్ఞానంద చేతిలో ఓడాడు. దీంతో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ఐదున్నర పాయింట్లతో నిలిచాడు. కార్ల్‌సన్ (6.5), ప్రజ్ఞానంద (6) టాప్–2లో కొనసాగుతున్నారు. విమెన్స్ సెక్షన్‌లో లాగ్నో, కోస్టానిక్, హారిక గేమ్‌లను డ్రాగా ముగించిన కోనేరు హంపి 4.5 పాయింట్లతో ఆరో ప్లేస్‌లో, హారిక 4 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌లో కొనసాగుతోంది.