
సంగారెడ్డి టౌన్ , వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్మేఘవాల్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న మేధావులతో సమావేశమయ్యారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఎల్ఎన్కాన్వెన్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు 33% రిజర్వేషన్, ఆయుష్మాన్ భారత్, కార్మిక చట్టాల కూర్పు, కొత్త విద్యా విధానం, ఫసల్ బీమా కార్యక్రమాల అమలులో ఉన్న లోపాలను సవరించడానికి తగిన సూచనలు ఇవ్వాలన్నారు. వాటిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కా
ర్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.