Rana Naidu 2 Teaser Talk: ఇప్పుడిక అన్నీ పగిలిపోవాల్సిందే.. బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరింది

Rana Naidu 2 Teaser Talk: ఇప్పుడిక అన్నీ పగిలిపోవాల్సిందే.. బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరింది

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కీ రోల్స్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'రానా నాయుడు'(Rana Naidu). ఈ సీజన్ 1కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రానా నాయుడు సీజన్ 2 నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

లేటెస్ట్గా రానా నాయుడు సీజన్ 2 టీజర్ను ముంబైలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా మరియు అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ముంబైలో జరిగిన గ్రాండ్ నెట్‌ఫ్లిక్స్ ఈవెంట్‌లో రానా నాయుడు సీజన్ 2 టీజర్ లాంచ్ చేశారు.

ఈ రెండో సీజన్ ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్గా విజువల్స్ హైప్ ఇస్తున్నాయి. ఈ సారి వెంకటేష్, రానా మధ్య ఫైట్ మరో లెవెల్కు చేరనున్నట్లు యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే అర్ధమవుతోంది. ఈ ప్రపంచంలో రానాని ఓడించేది అతని తండ్రి ఒక్కడే అని పవర్ ఫుల్ డైలాగుతో వెంకీ మామ ఎంట్రీ అదిరిపోయింది.

"ఇప్పుడిక అన్నీ పగిలిపోవాల్సిందే.. ఎందుకంటే ఇది రానా నాయుడు స్టైల్. రానా నాయుడు సీజన్ 2025లో రాబోతోంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే రానా నాయుడు సీజన్ 2 రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

ఇదివరకే..సీజన్ 2 ఉండబోతుందని 2024 ఏప్రిల్ నెలలోనే 18 సెకన్ల వీడియోతో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వీడియోకి ఇచ్చిన ట్యాగ్ కూడా అంచనాలు పెంచేసింది. "మరేం చింతించకండి..మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు..రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే విడుదల కానుందంటూ' అప్పట్లో నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తి్స్తోన్న ఈ సీజన్ 2 టీజర్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రానా నాయుడు సీరీస్ విషయానికి వస్తే..

ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించిన 'రానా నాయుడు' సిరీస్ 2023 మార్చి10న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నంబర్.1 స్థానంగా నిలిచి ట్రెండ్ స-ృష్టించింది. వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల పాటు నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కోసం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో 'రానా నాయుడు' కూడా ట్రెండ్ అయ్యాడు.

సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ 'రానా నాయుడు' సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ రూపొందించారు, సహ-దర్శకత్వం కూడా వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.