HIT3: మనల్ని ఎవడ్రా ఆపేది.. ప్రామిస్ చేస్తున్నా..హిట్ కన్ఫార్మ్: నాని

HIT3: మనల్ని ఎవడ్రా ఆపేది.. ప్రామిస్ చేస్తున్నా..హిట్ కన్ఫార్మ్: నాని

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌’. శ్రీనిధి శెట్టి హీరోయిన్. డాక్టర్ శైలేష్ కొలను దీనికి దర్శకుడు. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా 2025 మే 1న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 27న) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘ఒక థ్రిల్లర్‌‌‌‌, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే ఎలా ఉంటుందో హిట్ 3 అలా ఉంటుంది. ఇదొక ఆర్గానిక్ కాంబినేషన్. ఇందులో వయెలెన్స్‌‌‌‌  ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందరికీ ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అందిస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఈ సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నా.. వెనుక రాజమౌళి గారు.. ముందు మీరున్నారు. "హిట్" మీద గట్టి నమ్మకం ఉంది.. ఇక "మనల్ని ఎవడ్రా ఆపేది" - నాని’ అని అన్నారు.

ఇకపోతే హిట్-3’లో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ విజువల్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. విపరీతమైన కోపంతో తాండవం చేస్తున్న నాని సీన్స్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.