అర్జున్ అరైవింగ్ .. ప్రీ టీజర్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్

అర్జున్ అరైవింగ్ .. ప్రీ టీజర్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్

కళ్యాణ్ రామ్ హీరోగా  ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.  అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై  అశోక్ వర్ధన్ ముప్పా,  సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో  క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా ప్రీ టీజర్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. శుక్రవారం ఈ మూవీ ప్రీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కళ్యాణ్ రామ్  మోడరన్ గెటప్‌‌‌‌లో కనిపిస్తున్నాడు.  ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌‌‌‌తో,  భారీ మైనింగ్ ల్యాండ్‌‌‌‌స్కేప్‌‌‌‌లో డైనమిక్‌‌‌‌గా నడుచుకుంటూ వస్తూ ఇంప్రెస్ చేశాడు.  ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలు హైలైట్‌‌‌‌గా ఉండబోతున్నాయని మేకర్స్ చెప్పారు.  సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  సోహైల్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.  అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.  ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిందని, త్వరలోనే  రిలీజ్ డేట్‌‌‌‌ని అనౌన్స్ చేస్తామని చెప్పారు.