
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించి టీజర్‌తో పాటు ఓ పాటను విడుదల చేసిన మేకర్స్.. గురువారం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
వేసవి సెలవులు కలిసొచ్చేలా ఈనెల 18న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపించాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.
కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు ?
— NTR Arts (@NTRArtsOfficial) April 3, 2025
'????? ?/? ??????????' IN CINEMAS APRIL 18th, 2025 ❤?
This summer is going be high on emotions and action ??#ArjunSonOfVyjayanthi @NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan… pic.twitter.com/IMqzngCuHu
అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మళ్ళీ రాములమ్మ రాజకీయాల్లో బిజీ అయ్యింది. అలాగే ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించనని చెప్పింది. కానీ స్టోరీ నచ్చడంతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ కి టైమ్ కేటాయించింది. అయితే ఒకప్పుడు ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన విజయశాంతి మళ్ళీ ఈ సినిమాలో కూడా వింటేజ్ రాములమ్మగా కనిపించబోతోంది. దీంతో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో రెండో థియేటర్ నిర్మిస్తున్న అల్లు అర్జున్.. ప్రత్యేకత ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!