కురుక్షేత్రంలో అర్జునుడిలా.. కళ్యాణ్ రామ్

కురుక్షేత్రంలో  అర్జునుడిలా.. కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’. కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు.  ప్రదీప్ చిలుకూరి దర్శకుడు.  అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.  ఇప్పటికే ప్రమోషన్స్‌‌ ప్రారంభించి టీజర్‌‌తో పాటు ఓ పాటను విడుదల చేసిన మేకర్స్.. గురువారం మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

వేసవి సెలవులు కలిసొచ్చేలా ఈనెల 18న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  ‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన రిలీజ్ డేట్‌‌ పోస్టర్‌‌‌‌లో కళ్యాణ్ రామ్‌‌ మాస్‌‌, యాక్షన్ అవతార్‌‌‌‌లో కనిపించాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్,  పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందించాడు.