9 వికెట్లు పడగొట్టి అదరగొట్టిన సచిన టెండూల్కర్ కొడుకు అర్జున్‌‌‌‌..

ఆలూర్ (కర్నాటక): క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ కొత్త ఫస్ట్ క్లాస్ సీజన్‌‌‌‌కు ముందు తన బౌలింగ్‌‌‌‌ పవర్​ చూపెట్టాడు. గోవా  టీమ్‌‌‌‌కు ఆడుతున్న  అర్జున్‌‌‌‌  కేఎస్‌‌‌‌సీఏ ఇన్విటేషన్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో కర్నాటకపై చెలరేగిపోయాడు. సోమవారం ముగిసిన ఈ పోరులో అర్జున్ (9/87) మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో గోవా సీఏ ఎలెవన్ జట్టు ఇన్నింగ్స్‌‌‌‌ 189 రన్స్ తేడాతో ఆతిథ్య కర్నాటక ఎలెవన్‌‌‌‌ను చిత్తు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ ఐదు వికెట్లు పడగొట్టగా..  కర్నాటక 103 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ప్రతిగా గోవా 413 రన్స్ చేసి భారీ ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లోనూ అర్జున్ నాలుగు వికెట్లు కూల్చగా.. కర్నాటక 121 రన్స్‌‌‌‌కే ఆలౌటై చిత్తయింది.