ముంబై ఇండియన్స్ పేసర్, మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2024 కోసం సన్నద్ధమవుతున్నాడు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన అర్జున్.. తన సోదరి సారాతో కలిసి జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను సచిన్ తనయుడు తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.
గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎడమచేతి వాటం పేసర్ తన రెండు ఓవర్లలో 17 పరుగులివ్వగా.. వికెట్లేమీ తీయలేకపోయాడు. మొత్తంమీద తన నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 9.36 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు. ఈసారి అవకాశాలొస్తే మెరుగైన ప్రదర్శన చేయగలనన్న ధీమాతో ఉన్నాడు.
11 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు
ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ అర్జున్ టెండూల్కర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గోవా జట్టుకు ఆడుతున్న అర్జున్ 11 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్‌లో మెరిశాడు. రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 23.45 సగటుతో 258 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన గోవా చివరి గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాడు. ఈ సీజన్‌లో గోవా 7 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క దాంట్లో విజయం సాధించింది. ఐదింట ఓడి మరో మ్యాచ్ డ్రా చేసుకుంది.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్
- మార్చి 24న: గుజరాత్ టైటాన్స్‌తో
- మార్చి 27న: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
- ఏప్రిల్ 01న: రాజస్థాన్ రాయల్స్‌తో
- ఏప్రిల్ 07న: ఢిల్లీ క్యాపిటల్స్‌తో