వరలక్ష్మీ శరత్‌కుమార్, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్, ఆదిత్య శశికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘అర్జునుడి గీతోపదేశం’. సతీష్ గోగాడ దర్శకత్వంలో కె.త్రిలోక్ నాథ్, వి.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా, మల్లాల సీతారామరాజు కెమెరా స్విచాన్ చేశారు.
త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ‘ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. మార్చి 20 నుంచి అమలాపురంలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం.
దీని తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నైలో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఈ కథ ప్రేక్షకులందరినీ అలరించేలా ఉంటుందని నిర్మాత అన్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు.