కోస్గి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న కోస్గికి సీఎం రానుండగా, ఏర్పాట్లను జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో అడిషనల్ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు స్వయంశక్తి సంఘాలతో సమావేశం కోసం అనువైన వేదికను తయారు చేయాలన్నారు. సీఎం పర్యటనలో లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ మున్సిపాలిటీ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్డీవో రాంచంద్రనాయక్, జడ్పీ సీఈవో శైలజ, డిప్యూటీ సీఈవో జ్యోతి, డీఏవో జాన్సుధాకర్, డీఎఫ్ వో వీణావాణి ఉన్నారు.
సీఎం సభను సక్సెస్ చేయాలి
ఈ నెల 21న కోస్గిలో జరిగే సీఎం సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.400 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని కోరారు. వార్ల విజయ్ కుమార్, నాగులపల్లి నరేందర్, బెజ్జు రాములు పాల్గొన్నారు.