ఖమ్మంలో రిపబ్లిక్ ​డేకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలోని పోలీస్​ పరేడ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో జరిగే రిపబ్లిక్​ డే సెలబ్రేషన్స్​కు  పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌ తెలిపారు. గురువారం కొత్త కలెక్టరేట్‌‌‌‌ మీటింగ్​ హాల్​లో జిల్లా అధికారులతో వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై శకటాలు, స్టాల్స్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​డి.మధుసూదన్‌‌‌‌ నాయక్‌‌‌‌, డీఆర్డీఓ విద్యచందన, జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖర్ శర్మ, ఆర్టీవో మహమ్మాద్ గౌస్, డీడీ సోషల్ వెల్ఫేర్ అధికారి సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, రెవెన్యూ డివిజన్ అధికారి గణేశ్, ఫైర్ ఆఫీసర్ జయప్రకాశ్, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు.