ఆర్మూర్, వెలుగు: తన చావైనా, బతుకైనా ఆర్మూర్ గడ్డపైనే అని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు బుధవారం రాకేశ్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. హత్యా రాజకీయాలు చేసే జీవన్ రెడ్డిని సాగనంపేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
అవినీతి రహిత పాలన కోసం, ఆర్మూర్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. జిల్లా మత్స్యకార పరిశ్రమల సహకార సంఘం అధ్యక్షుడు బింగి పెంటయ్య, ఆర్మూర్ మండలం పిప్రి మాజీ ఎంపీటీసీ కేసీ ముత్తన్న, మంథని లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ బీజేపీలో చేరారు. కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ కు చెందిన లోలం నారాయణ, నాంపల్లి జగన్నాథం, కలిగోట నడ్పి గంగాధర్, కలిగోట భుమేశ్వర్, శ్రీనివాస్, తోట శేఖర్, బోడమిది సురేశ్, శ్రీనివాస్, దేగాం సాగర్ సైతం పార్టీలో చేరారు.