లక్కంపల్లిలో ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి నిరసన సెగ

నందిపేట, వెలుగు :  ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి అడుగడుగున నిరసనలు ఎదురైతున్నాయి. మండలంలో ఇదివరకే కుద్వాన్​పూర్, కొండూర్, అన్నారం గ్రామాల్లో నిరసనలు ఎదురవగా తాజాగా లక్కంపల్లిలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. సోమవారం ఎమ్మెల్యే గ్రామంలో ప్రచారానికి రానున్నాడని తెలుసుకున్న గ్రామ యువకులు లక్కంపల్లి సెజ్​లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎందుకు ఇప్పించలేదని, గ్రామంలో ఎంత మందికి గృహలక్ష్మి, బీసీ బంధు పథకాల కింద లబ్ధి చేకూరిందని ప్రశ్నిస్తూ , ఎమ్మెల్యే గో బ్యాక్​ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గమనించిన బీఆర్ఎస్​ లీడర్లు ఎమ్మెల్యే గ్రామానికి రాకముందే ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. ​