హనుమకొండ/కాజీపేట, వెలుగు : మోదీని మరోసారి ప్రధాని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి అయోధ్యలో అడుగు పెట్టే దమ్ము లేదని, వారు అయోధ్యకు వెళ్తే తాను తల నరుక్కుంటానన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ములుగు రోడ్డు నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు గందరగోళం సృష్టిస్తున్నారని, ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందన్నారు. ఉచిత పథకాలతో ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తారని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆరు వర్గాలు ఉన్నాయని
రేవంత్ రెడ్డి ప్రధానిపై యుద్ధం చేస్తా అనడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారెడ్డి, కొండేటి శ్రీధర్, విజయ్‌చందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కాజీపేట మండలం మడికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకులు దువ్వ నవీన్ బీజేపీలో చేరడంతో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.