- ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట ధర్నా, వినతిపత్రం అందజేత
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్మున్సిపల్పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డీవో రాజాగౌడ్కు మెమోరాండం అందజేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్మూర్, పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లిలో ఇరిగేషన్, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు కబ్జా చేశారని, వీటికి మున్సిపల్అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాలను ఆక్రమిస్తున్నా మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్లుగా పర్మిషన్లు ఇస్తున్నారని విమర్శించారు.
స్థలాలకు కబ్జా చేస్తున్న వారికి సహకరిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జెస్సు అనిల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ద్యాగ ఉదయ్. కిసాన్ మోర్చా, బీజేపీ, బీజైవైఎం నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.