నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిట్ వినీత వైఖరిపై అధికార పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చైర్ పర్సన్ మాకొద్దంటూ 26 మంది మహిళ కౌన్సిలర్లు చైర్మన్ పై నిరసన తెలుపుతున్నారు. చైర్మన్ వినీతను తన కుర్చీకి పరిమితం చేసి.. షాడో చైర్మన్లు గా చైర్మన్ భర్త పండిత్ పవన్, అతని తమ్ముడు పండిత్ ప్రేమ్ పెత్తనం చెలాయిస్తున్నారని కౌన్సిలర్ల భర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో 26 మంది కౌన్సిలర్ల భర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. మున్సిపల్ నిధుల కేటాయింపు, ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేయనున్నాట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ తొలగించాలని ఎమ్మెల్యేని కోరుతామని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఈ మేరకు వారంతా సమావేశమై షాడో చైర్మన్ ల అక్రమాలపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.