ఆర్మూర్, వెలుగు: గ్రీన్ బడ్జెట్ పేరుతో మరో అవినీతికి మున్సిపల్ పాలకులు సిద్ధమవుతున్నారని ఆర్మూర్ బీజేపీ లీడర్లు ఆరోపించారు.
ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన తెలిపి సిబ్బందికి మెమోరాండం ఇచ్చారు.
బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్కుమార్మాట్లాడుతూ.. గ్రీన్ బడ్జెట్ పేరుతో దాదాపు రూ. 25 లక్షలు దోచుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆర్మూర్ అంగడి ప్రాంగణంలో నాటాల్సిన మూడు వేల మొక్కలను డంపింగ్ యార్డ్ లో పడేసి, నాటినట్లుగా డబ్బులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు.
టౌన్లో అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారన్నారు.