అభివృద్ధిని విస్మరించిన జీవన్​రెడ్డికి ఓటెందుకేయాలి : బీజేపీ లీడర్లు

ఆర్మూర్, వెలుగు: అవినీతి అక్రమాలకు పాల్పడి అభివృద్ధిని విస్మరించిన మీకు ఎందుకు ఓటేయ్యాలంటూ ఆర్మూర్ బీజేపీ లీడర్లు  ఎమ్మెల్యే జీవన్​రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలపై చార్జ్ షీట్ పేరుతో బీజేపీ టౌన్ శాఖ ముద్రించిన పాంప్లెంట్స్​ను గురువారం బీజేపీ లీడర్లు ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ద్యాగ ఉదయ్, కలిగోట గంగాధర్ మాట్లాడారు.

2018 లో టీయూఎఫ్ఐడీసీ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తే నాణ్యత లేని రోడ్లు వేయించి రూ.23 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. మున్సిపల్ లో విలీనమైన మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలకు 2019 లో నిధులు మంజూరైతే ఇప్పుడు రోడ్లు వేయిసున్నారని, ఇన్ని రోజులు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మినీ స్టేడియంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ఎందుకు ప్రారంభించలేదని, లెదర్ పార్క్ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదన్నారు. వంద పడకల హాస్పిటల్ అని చెప్పి డాక్టర్స్, స్టాఫ్ నియామించలేదన్నారు. పదేండ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్​ఇల్లు కూడా కట్టలేదన్నారు కార్యక్రమంలో ఆరె రాజేశ్వర్, డమాంకర్​శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ALSO READ: బీఆర్ఎస్​ మెనిఫెస్టో తెలంగాణ బతుకు చిత్రం మారుస్తుంది : కేటీఆర్