సొంత పార్టీ ఎమ్మెల్యేకే జీవన్ రెడ్డి వార్నింగ్.. తనతో పెట్టుకుంటే పాము లెక్క పగబడుతాడట

ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై గుస్సాతో ఉన్నారట. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులకు వెరైటీ వార్నింగ్ ఇస్తున్నారట. తనతో పెట్టుకోవద్దని అందరికీ గుర్తు చేస్తున్నారట. పాము లెక్క పగ పడితే వదలనని చెప్తున్నారట. ఒక్కసారి మెమోరీలోకి వస్తే ఇక అంతేనని ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారట. తనకు తానే పాముగా చెప్పుకుంటున్నారట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

ఈసారి జీవన్ రెడ్డికి ఆర్మూర్ టికెట్ రాదని, వచ్చినా ఓడిపోతారని ఆయనకు పడనోళ్లు ప్రచారం చేస్తున్నారట. ఈ ప్రచారం జీవన్ రెడ్డి చేవిలో పడ్డిందట. ఇంకేముందు ప్రత్యార్థులపై పాములెక్క బుస్సున లేచారట. తన బ్లడ్ గ్రూప్, పాముల బ్లడ్ గ్రూప్ ఒకటేనని వార్నింగ్ ఇస్తున్నారట. పాములెక్క ఒక్కసారి పగబడితే టార్గెట్ చేరే వరకు వదలిపెట్టేది లేదని డైలాగులు చెప్తున్నారట ఆర్మూర్ ఎమ్మెల్యే.

తనపై తప్పుడు ప్రచారం వెనక ప్రగతి భవన్ లోని ఓ యువ ఎమ్మెల్యే ఉన్నారని ఫైర్ అవుతున్నారట జీవన్ రెడ్డి. సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతరేకత ఉందని ఆ ఎమ్మెల్యేనే ప్రచారం చేయిస్తున్నారని జీవన్ రెడ్డి రగిలిపోతున్నారట. తనని ప్రగతి భవన్ కు రాకుండా చేయటానికే ఆ యువ ఎమ్మెల్యే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారట. సర్వేల్లో తనకు ఫుల్ పాజిటీవ్ ఉందని, తనని ఎవరూ అడ్డుకోలేరని చెప్తున్నారట ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైనా తననే మొదటి అభ్యర్థిగా ప్రకటించే సీఎం కేసీఆర్..ఈసారి ఆ సెంటిమెంట్ ఫాలో కాలేదని జీవన్ రెడ్డి ఫీలవుతున్నారట. అందుకే తన ప్రత్యర్థి వర్గానికి అలుసయ్యానని  బాధపడుతున్నారట ఎమ్మెల్యే. తనతో పెట్టుకోవడానికి విపక్షాల ప్రత్యర్థులే భయపడుతారని, ఆ భయాన్ని సొంత పార్టీలోని ప్రత్యర్థులకు  కూడా చూపిస్తానని హెచ్చరిస్తున్నారట  జీవన్ రెడ్డి.