ఆర్మూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఆర్మూర్ డిప్యూటీ తహసీల్దార్ భూలోకం విజయ్ కాంతరావు ఎన్నికయ్యారు. శంషాబాద్ లో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన విజయ్ కాంతరావును బుధవారం ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ అశోక్సింగ్, స్టాఫ్ అభినందించారు.
జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న విజయకాంత్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమితులవ్వడం అభినందనీయమని తహసీల్దార్ శ్రీకాంత్ పేర్కొన్నారు.