చేపూర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

చేపూర్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మండలం చేపూర్ జడ్పీ హై స్కూల్​ లో 2001--2002 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గురుకులంలో లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన చైతన్య శాంతి, టీచర్ ఉద్యోగం పొందిన బి.సురేశ్, ఎలక్ట్రిసిటీ శాఖలో ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందిన సుంకరి ప్రభాకర్, దాసరి శ్రీకాంత్ లను ఘనంగా సన్మానించారు.  

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెడ్మాస్టర్లు రామ్ కిషన్ రావు, మట్ట గంగాధర్, రాజేశ్వర్ రెడ్డి, బి. గంగారం హాజరై  ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తమను సత్కరించిన స్టూడెంట్స్​ ను అభినందించారు.  దాదాపు 22 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారు భావోద్వేగాలకు లోనయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.