ఆర్మూర్, వెలుగు: అభివృద్ధి పనులపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం వివిధ శాఖల ఆధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మండల పరిషత్అధికారులతో వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. సమీక్షలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్గజానన్, ఎంఈవో పింజ రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.