ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్మోడల్స్కూల్నిర్మించాలని, వారం రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Also read : వైన్ షాప్లో స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలని.. కత్తితో బెదిరించారు
ఆర్మూర్అభివృద్ధి కోసం పోరాటాలు చేయడానికైనా సిద్ధమన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు సౌత్ తెలంగాణకే కేటాయించి నార్త్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.