నందిపేట, వెలుగు : నందిపేట మండలం కుద్వాన్పూర్ లోనిఎస్సీ, బీసీ హాస్టళ్ల సమస్యలను పరిష్కరిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. బుధవారం హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న తర్వాత వారితో కలిసి అల్పాహారం చేశారు.
అనంతరం రికార్డులు, వంట గదిని పరిశీలించారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని వృథా చేయొద్దని వార్డెన్ రామును హెచ్చరించారు. హాస్టల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.