వంద శాతం టాక్స్ వసూలు చేయాలి : మున్సిపల్ ​కమిషనర్​ రాజు

వంద శాతం టాక్స్ వసూలు చేయాలి : మున్సిపల్ ​కమిషనర్​ రాజు

ఆర్మూర్, వెలుగు:  వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆర్మూర్​ మున్సిపల్ ​కమిషనర్​ రాజు సిబ్బందికి సూచించారు. బుధవారం ఆర్మూర్​మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  మొండి బకాయిల వసూలుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. వీలైతే నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ తొలగించాలని, లేదంటే ఇంటిని సీజ్ చేసైనా టాక్స్ వసూలు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద ఆర్మూర్ మున్సిపల్​ పరిధిలో 4125 దరఖాస్తులు వచ్చాయన్నారు.

 ఇందులో 3065 మందికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపించామని తెలిపారు. ఇందులో 201 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని, వారికి 25 శాతం రాయితీ కింద లబ్ధి చేకూరిందని తెలిపారు. సమావేశంలో ఆర్​వో ఉమాదేవి ఆర్ఐ దత్త రెడ్డి, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.