ఆర్మూర్, వెలుగు: మండలంలోని మంథని గ్రామంలో ఆర్మూర్ పోలీసులు మంగళవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనఖీలు జరిపారు. సరైన డాక్యుమెంట్స్ లేని 37 బైకులను సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ జగదీశ్ చందర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలననారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతం గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించారు. ప్రొగ్రాంలో ఆర్మూర్ సీఐ సురేశ్‌బాబు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.