ఆర్మూర్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్మూర్ జర్నలిస్టులకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు, ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాయి బాబా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్, సంజయ్ సింగ్ బబ్లు, మారుతి రెడ్డి, కొంతం మురళి, చిట్టి రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.