ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా గుహలో మావోయిస్టుల ఆయుధాగారం కూంబింగ్​లో స్వాధీనం చేసుకున్న కోబ్రా బలగాలు

 ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా గుహలో మావోయిస్టుల ఆయుధాగారం కూంబింగ్​లో స్వాధీనం చేసుకున్న కోబ్రా బలగాలు

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆయుధాగారాన్ని గురువారం కోబ్రా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. దుల్లేడు-– మెట్టగూడెం మధ్య అడవుల్లో కూంబింగ్​కు వెళ్లిన బలగాలకు ఒక గుహ కనిపించింది. అందులో మావోయిస్టులు ఆయుధాలను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 21 ఐఈడీలతో పాటు14 బీజీఎల్​ లాంచ ర్లు, భారీగా పేలుడు పదార్థాలు, మెడిసిన్, పైపులు, గ్యాస్ వెల్డింగ్​ మెషీన్, జనరేటర్, హ్యాండ్ ​డ్రిల్​మిషన్​ వంటి 31 రకాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

సొరంగంలోని మందుపాతర్ల నిర్వీర్యం 

బీజాపూర్​జిల్లా బాసగూడ పీఎస్ పరిధిలోని ఆవపల్లి- – బాస గూడ మధ్య స్టేట్​ హైవేపై దుర్గా మందిర్​వద్ద మావోయిస్టులు భారీ మందుపాతరను ఏర్పాటు చేశారు. రోడ్డు కింద సొరంగం తవ్వి అందులో అమర్చారు. కూంబింగ్​వచ్చే బలగాల వాహనాలు టార్గెట్ గా ఏర్పాటు చేశారు. బాంబ్ ​స్క్వాడ్​ దీన్ని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో సీఆర్​పీఎఫ్​168 బెటాలియన్​ జవాన్లు పాల్గొన్నారు.