
- మీడియా తో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి చిట్ చాట్
ఆర్మూర్, వెలుగు : ఏడాదిన్నర పాలనలో అవినీతికి దూరంగా ఉన్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని తన నివాసంలో మీడియా తో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా హైదరాబాద్లో అధిక సమయం కేటాయించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలైన రౌడీయిజం, గంజాయి చాలా వరకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
త్వరలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి నుండి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడచిన ఏడాదిన్నర పాలనలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్ ఉన్నారు.