
- - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లైబ్రరీ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్‌లోని లైబ్రరీ, నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ వేసవిలో చల్లని మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. లైబ్రరీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయిస్తానని, త్వరలోనే టాయిలెట్స్ నిర్మిస్తామని చెప్పారు.
నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. నూతన భవనం పూర్తికాగానే డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, లైబ్రరీయన్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.