మున్సిపల్ ఎలక్షన్స్​కు సిద్ధం కావాలి : పైడి రాకేశ్​రెడ్డి 

మున్సిపల్ ఎలక్షన్స్​కు సిద్ధం కావాలి : పైడి రాకేశ్​రెడ్డి 
  •     ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి 

ఆర్మూర్, వెలుగు : బూత్​ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు పూర్తయినందున రానున్న మున్సిపల్ ఎలక్షన్స్​కు సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి  దిశానిర్దేశం చేశారు.  గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో ఆర్మూర్ నాయకులు ఎమ్మెల్యేని మర్యాద పూర్వకంగా కలిశారు.  మున్సిపల్ సమస్యలపై వారితో చర్చించి, మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే చెప్పారు.

ఎమ్మెల్యేను  కలిసిన వారిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, టౌన్​ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, టౌన్​కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, బీజేవైఎం ఆర్మూర్ టౌన్​, మండల ప్రెసిడెంట్స్​కలిగోట్ ప్రశాంత్, నరేశ్​చారి, బీజేవైఎం టౌన్​ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్​బాశెట్టి రాజ్ కుమార్, గిరిజన మోర్చా టౌన్​ ప్రెసిడెంట్​ పీర్ సింగ్ నాయక్, రెడ్డబోయిన దక్షిణామూర్తి, బట్టు రాము తదితరులు ఉన్నారు.