సహకార సంఘాల ద్వారా సబ్సిడీ రుణాలు : ​ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

సహకార సంఘాల ద్వారా సబ్సిడీ రుణాలు : ​ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు : ప్రభుత్వ సబ్సిడీ రుణాలు, యంత్ర పరికరాలు సహకార సంఘాల ద్వారానే  అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయని, రైతులు సద్వనియోగం చేసుకోవాలని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కుద్వాన్​పూర్​ గ్రామంలో  నూతనంగా నిర్మించిన 500 మెట్రిక్​ టన్నుల సామర్థ్యం గల గోదాంను,  వన్నెల్​ 'కే'  గ్రామంలో డీసీసీబీ బ్యాంక్​ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.  సహకార సంఘాలు, కో‌‌ఆపరేటివ్​ బ్యాంకులు రైతులకు సేవలు అందించేందుకు వారధిగా ఉంటాయన్నారు.  కార్యక్రమంలో మార్క్​ఫైడ్​ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్​ కుంట రమేశ్​​రెడ్డి, కుద్వాన్​పూర్​ సొసైటీ చైర్మన్​ కార్తీక్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం..

డొంకేశ్వర్ మండల కేంద్రంలో బుధవారం నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి నందిపేట మండలంలోని డొంకేశ్వర్​ను కొత్త మండలం గా ఏర్పాటు చేసినప్పటికీ కార్యకలాపాలన్నీ నందిపేట ఎంపీడీవో కార్యాలయం నుంచే జరిగేవి. ఇప్పుడు డొంకేశ్వర్​లో కార్యాలయం ఏర్పాటుతో మండల ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావ్​, బీజేపీ నాయకులు సురేందర్​, రమేశ్​, సురేశ్​తదితరులు పాల్గొన్నారు. .