
- కేంద్ర మంత్రులను కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కలిసి కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్రమంత్రులిద్దరిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయాలని వారిని కోరారు. విమానాశ్రయం ఏర్పాటుకు గతంలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ఈ ఎయిర్ పోర్టు ఏర్పాటు ద్వారా తెలంగాణ యూనివర్సిటీ, బాసర ట్రిపుల్ ఐటీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధితో పాటు ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, ఉద్యోగ, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.