
ఆర్మూర్, వెలుగు : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఈ నెలాఖరులోపు చెల్లించి ఎర్లీ బర్డ్ స్కీంలో ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీ పొందాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని యజమానులు తమ ఆస్తి పన్ను చెల్లించాలని సూచించారు.
2020 లో భూమి క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు, ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ ఏప్రిల్ 30 లోపు ముగుస్తున్నందున ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు.