ఆర్మూర్ లో ఘనంగా బోనాలు

ఆర్మూర్ లో ఘనంగా బోనాలు

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు, మహిళలు బోనాలు ఎత్తుకుని పెద్ద బజార్ నుంచి దోభీఘాట్​ మీదుగా పెద్దమ్మ తల్లి ఆలయం వరకు వెళ్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సంఘం అధ్యక్షుడు బోండ్ల సంతోష్​, జక్కం శేఖర్, సుంకరిమోహన్, జక్కం భూమన్న, జిన్నా, సుమన్, సుంకరి శంకర్ తదితరులు పాల్గొన్నారు-.