ఉల్లాసంగా సాగుతున్న గణేష్ నిమజ్జనంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్షా కోటలోని శివ ఎలైట్ అపార్ట్ మెంట్ లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గురువారం ఆ గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. దాంతో అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న హైరీచ్ ఇంటర్నెట్ సిబ్బంది అపార్ట్ మెంట్ పైన మందు పార్టీ చేసుకుంటున్నారు. అది గమనించిన ఆర్మీ మాజీ ఉద్యోగి నాగ మల్లేష్.. వారిని ఇక్కడ పార్టీ చేసుకోవద్దని వారించాడు. పలుమార్లు చెప్పినా కూడా వాళ్లు వినకపోవడంతో.. నాగమల్లేష్ ఇంట్లోని తుపాకీ తీసుకొచ్చి గాలిలోకి కాల్పులు జరిపాడు. ఇంటర్నెట్ సిబ్బంది ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు రివాల్వర్ స్వాధీనం చేసుకొని నాగ మల్లేష్ ని అదుపులోకి తీసుకున్నారు.
For More News..