
నార్కట్‌పల్లి, వెలుగు: విజయవాడ నుంచి హకీంపేట వెళ్తున్న ఓ ఆర్మీ హెలీకాప్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల శివారులోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హకీంపేటలోని ఆర్మీ క్యాంప్‌కు చెందిన హెలీకాప్టర్ విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు వారం కింద వెళ్లింది. గురువారం తిరిగి హకీంపేట వస్తుండగా మార్గమధ్యలో హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్ వనిపాకల శివారులోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. అనంతరం హకీంపేట ఎయిర్ క్యాంప్ నుంచి మరో హెలికాప్టర్‌లో ఆఫీసర్లు వచ్చి రిపేర్లు చేయడంతో తిరిగి హకీంపేటకు వెళ్లిపోయింది. హెలికాప్టర్ దిగిన విషయాన్ని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు.