జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా శివ్ గఢ్‌లో ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించపోవడంతో కూలిపోయిన హెలికాప్టర్ తునాతునకలైపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ఉన్నారు. పొగ మంచు కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసుల
ఆర్మీ హెలికాప్టర్ కూలిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రెస్క్యూ టీమ్‌తో పోలీసులు ఆ స్పాట్‌కు చేరుకున్నారని ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌధరీ తెలిపారు. పొగ మంచు కారణంగా హెలికాప్టర్ కూలినట్లు ఆయన అన్నారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే హెలికాప్టర్ కూలిపోయిందా? లేక క్రాష్ ల్యాండింగ్ జరిగిందా? అన్నది తెలియాల్సి ఉందని అన్నారు.