- బైక్లు, కార్లు, బర్లు అన్నీ పోయినయ్
- గ్రామస్తులను రక్షించిన రెస్క్యూ టీం
- హెలికాప్టర్ల ద్వారా రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
- మిగతా జిల్లాల్లోనూ వదరల్లో మిస్సింగ్
- నలుగురే గల్లంతయ్యారంటున్న కొందరు
“నైట్ 2 నుంచి ఫుల్ రెయిన్ ఉంది.. 4 గంటల వరకు అన్నీ కొట్టుకుపోవడం స్టార్ట్ అయ్యింది. వెహికిల్స్.. కార్లు పోయినయ్.. మాకు తెలిసినంత వరకు 15 నుంచి 20 మంది కొట్టుకు పోయిండ్రు.. కాపాడేందుకు పోయినోళ్లు కూడా కొట్క పోయిండ్రు.. ప్రతి ఒక్కరికీ కాల్ చేశాం.. ఎవరూ రెస్పాండ్ కాలేదు.. దాదాపు 100 మంది అక్కడే ఉన్నారు.. ” అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.. మోరంచపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్.. ఆర్మీకి సంబంధించిన రెండు హెలీకాప్టర్ లు రెస్క్యూ చేస్తున్నాయి. దాదాపు 40 నుంచి యాభై మంది తీసుకొచ్చారు. మిగతా వారిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి. ఎగువ న వర్షాలు కురుస్తుండటంతో మోరంచవాగు ఉధృతి పెరుగుతుంది. ముందుగా చిన్న ఇండ్లు, గుడిసెలు ఉన్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి 8 నుంచి వరద స్టార్ట్ అయ్యంది. భారీ వర్షం ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం వరకు ఉప్పెనలా మారింది. 7, 8 తర్వాత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు.
బైక్ లు , కార్లు కొట్టుకుపోతున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.. అధికారుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదంటున్నారు. నలుగురు గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహాలక్ష్మి, సరోజన గల్లంతయ్యారని చెబుతున్నారు. వారిలో ఒకరిని అయితే వరద పూర్తిగా తేరుకుంటే గానీ ఎవరు బతికి ఉన్నారు.. ఎవరు లేరు అనేది తెలుస్తుందని స్థానికులు అంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 మంది గల్లంతయ్యారు. వారిలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మానేరు వాగు ఉప్పొంగడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో 12 మంది చిక్కుకుపోయారు. కరీంనగర్జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామ శివారులోని చెరువులో 70 మంది ఝార్ఖండ్ కూలీలను చిక్కుకున్నారు. వారిని డీఆర్ఎఫ్రెస్య్కూ సిబ్బంది తాళ్ల ద్వారా తరలించారు. మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ లో ఏడుగురు లక్ష్మీనారాయణ(55), లక్ష్మి(50) , యశ్వంత్, అరవింద్, విఘ్నేష్(2), ప్రవల్లిక(27), కావ్య(26) చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.
గ్రామానికి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోరాంచపల్లి గ్రామానికి చేరుకొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు కూడా వచ్చి సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి.