
- ఎంట్రెన్స్ కు ఫ్రీగా కోచింగ్
- సీటొచ్చినోళ్లకు ఫీజు చెల్లింపు
శ్రీనగర్: మెడిసిన్ చదవాలనుకునే కాశ్మీర్ స్టూడెంట్లకు ఆర్మీ అండగా నిలుస్తోంది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడంతోపాటు అడ్మిషన్ పొందిన తర్వాత ఫీజు కూడా చెల్లిస్తోంది. 2018లో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో 30 మంది బాయ్స్‌కు కోచింగ్ ఇచ్చామని.. వారిలో 25 మంది ఎంట్రన్స్ క్లియర్ చేసి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారని ఆర్మీ స్పాన్సర్డ్ ఇనిస్టిట్యూట్ టీచర్ వహీద్ ఫరూక్ తెలిపారు. సూపర్ 30గా ఉన్న ఈ ప్రాజెక్టును 2021లో ‘సూపర్ 50’గా చేసి 30 మంది బాయ్స్‌తోపాటు 20 మంది గర్ల్స్‌కు కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. 2018లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు నార్త్ కాశ్మీర్‌లోని అన్ని స్కూళ్లకు వెళ్లి, ఎగ్జామ్ పెట్టి 30 మందిని కోచింగ్ కోసం సెలెక్ట్ చేశామన్నారు. కోచింగ్ తీసుకున్న బాయ్స్ అందరూ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారని, గర్ల్స్ కూడా వంద శాతం సక్సెస్ అవుతారని మరో టీచర్ అనుప్రీత శాండిల్య పేర్కొన్నారు.